శత్రువునైనా ప్రేమించమనే క్రీస్తు సందేశం ఆదర్శనీయం: సీఎం కేసీఆర్

గుడ్ ఫ్రైడే పర్వదినం సందర్భంగా తెలంగాణ సీఎం కేసీఆర్ క్రైస్తవులకు శుభాకాంక్షలు తెలియజేశారు. కరోనా వ్యాప్తి ఇంకా తొలగిపోనందున, క్రైస్తవులు అన్ని జాగ్రత్తలు తీసుకుని గుడ్ ఫ్రైడే వేడుకలు జరుపుకోవాలని సూచించారు.

క్రీస్తు కరుణామయుడని, ఆయన పాటించిన సహనం, ప్రేమ, దయ, శాంతి, త్యాగం వంటి విలువలు, శత్రువునైనా ప్రేమించమనే ఆదర్శం యావత్ మానవాళి అనుసరించదగ్గవని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. జీసస్ అందించిన శాంతి సందేశాన్ని ప్రజలు మరోసారి మననం చేసుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఆయన బోధనల్లో మానవీయత ఉందని కొనియాడారు.