ఏపీలో సిటీ బస్సు సర్వీసులు

ఆంధ్రప్రదేశ్ లో లాక్‌డౌన్ సడలింపుల్లో భాగంగా మే 21 నుంచే రాష్ట్రవ్యాప్తంగా బస్సు సర్వీసులు ప్రారంభమయ్యాయి. కానీ విజయవాడ, విశాఖపట్టణంలో సిటీ బస్సులు ప్రారంభం కాలేదు. ఇక ఈ బస్సు సర్వీసులను ఈ నెల 20 నుంచి నడిపేందుకు ఆర్టీసీ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 20 నుంచి 26 వరకు గ్రామ/వార్డు సచివాలయ పోస్టుల రాత పరీక్షలు ఉండగా.. 10 లక్షల మంది పరీక్షలు రాయనున్నారు. ఈ క్రమంలో అందుకు తగ్గట్లుగా ఆర్టీసీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో 20 నుంచి సిటీ బస్సు సర్వీసులను తిప్పేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. హెల్త్ ప్రొటోకాల్ ప్రకారం సిటీ బస్సు సర్వీసులు నడవనున్నాయి. ఈ మేరకు ఏపీఎస్‌ఆర్టీసీ, సిద్ధం చేసిన ప్రణాళికను వైద్యారోగ్య ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి అనుమతి కోసం పంపింది. ఏపీ సీఎస్ నీలం సాహ్నితో కలిసి జవహర్‌ రెడ్డి నిర్ణయం తీసుకొని సిటీ బస్సు సర్వీసులకు అనుమతిని ఇస్తారని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు.