హైదరాబాద్‌లో రోడ్డెక్కిన సిటీ బస్సులు

కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా నిలిచిపోయిన హైదరాబాద్ సిటీ బస్సు సర్వీసులు నేడు రోడ్డెక్కాయి. లాక్‌డౌన్ సమయంలో మార్చి చివరి వారంలో రద్దయిన బస్సు సర్వీసులు దాదాపు 6 నెలల విరామం తర్వాత అందుబాటులోకి వచ్చాయి. అయితే కోవిడ్19 నిబంధనలు, కరోనా వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని నగరంలోని అన్నిరూట్లలో 25% బస్సులు ప్రారంభించారు.

కోవిడ్ నిబంధనలు అనుసరిస్తూ హైదరాబాద్‌లో శుక్రవారం నేటి నుంచి 700 బస్సు సర్వీసులు నగరవాసులకు అందుబాటులోకి వచ్చాయి. నగరంలోని 25 శాతం బస్సులను పునరుద్ధరించేందుకు సీఎం కేసీఆర్ అనుమతి ఇచ్చారని తెలంగాణ రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ తెలిపారు.

నగరంలోని ప్రతి డిపోకు 35 బస్సుల చొప్పున నడవనున్నాయని మంత్రి పేర్కొన్నారు. కర్ణాటక, మహారాష్ట్ర అంతరాష్ట్ర బస్సు సర్వీసులు కూడా పునరుద్ధరించాలని సీఏం కేసీఆర్ సూచించారు. ఏపీ బస్సు సర్వీసులపై ఇంకా స్పష్టత రాలేదు. ఉన్నతస్థాయి సమావేశం తర్వాత దీనిపై నిర్ణయం తీసుకోనున్నారు.