సచిన్ రికార్డును బ్రేక్ చేసిన రాహుల్

ప్రపంచ క్రికెట్ చరిత్ర లో సచిన్ టెండూల్కర్ నెలకొల్పిన రికార్డు లు గురించి ఎంత చెప్పినా తక్కువే.. అయితే కేవలం టెస్ట్ క్రికెట్, వన్ డే క్రికెట్ లో మాత్రమే కాకుండా IPL లో కూడా సచిన్ దుమ్ములేపాడు.. IPLచరిత్రలోనే అతి తక్కువ ఇన్నింగ్స్ లలో 2000 పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు సచిన్. అయితే ఇపుడు ఆ రికార్డు ను రాహుల్ బ్రేక్ చేసాడు.

ఐపీఎల్ లో మొత్తం 63 ఇన్నింగ్స్ లలో సచిన్ ఈ మార్క్ అందుకోగా కేవలం 59 ఇన్నింగ్స్ లలోనే కింగ్స్ లెవెన్ పంజాబ్ కెప్టెన్ రాహుల్ ఈ ఘనత సాధించాడు. నిన్న జరిగిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్- రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ మధ్య జరుగుతున్న మ్యాచ్ లో రాహుల్ ఈ రికార్డు అందుకున్నాడు. ఈ ఘనతను సచిన్ 2012 లో సాధించాడు.

ఇక ఈ మ్యాచ్ లో కింగ్స్ లెవెన్ దాటికి స్టార్ ఆటగాడు కోహ్లీ సారథ్యంలోని ఆర్సీఐబి జట్టు 97 పరుగుల తేడాతో చిత్తుగా ఓడింది..ఈ మ్యాచ్ లో రాహుల్ తన విశ్వరూపం చూపీంచాడు..సిక్సర్లు , ఫోర్లతో బెంగుళూరు బౌలర్లకు చుక్కలు చూయించాడు..రాహుల్ దాటికి దిగ్గజ బౌలర్ స్టెయిన్ దగ్గర కూడా సమాధానం లేకుండా పోయింది..ఇక బౌలింగ్ లో కూడా కింగ్స్ లెవెన్ బౌలర్లు అందరు సమిష్టిగా రాణించడంతో 97 పరుగుల భారీ తేడాతో పంజాబ్ జట్టు విజయం సాధించింది.