ఏపీలో స్కూళ్లు మూసివేత.. పరీక్షలు యథాతథం

కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. స్కూళ్లలోనూ కరోనా విస్తరిస్తున్న సమయంలో పాఠశాలలను మూసివేయాలని నిర్ణయించింది. దీంతో మంగళవారం నుంచి స్కూళ్లు మూసివేయాలని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఒకటో తరగతి నుంచి 9వ తరగతి వరకు స్కూళ్లు వేస్తున్నట్లు విద్యాశాఖ ప్రకటించింది. కరోనా పరిస్థితులపై సోమవారం సీఎం జగన్ అధికారులతో సమీక్ష జరిపారు. ఈ సమావేశంలో స్కూళ్లు బంద్ చేయాలని నిర్ణయించారు.

అటు స్కూళ్లు మూసివేసినా పరీక్షలను మాత్రం యధావిధిగా నిర్వహిస్తామని మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. షెడ్యూల్ ప్రకారమే 10వ తరగతి, ఇంటర్ పరీక్షలు జరుగుతాయని మంత్రి ప్రకటించారు.