ఏలూరులో సీఎం జగన్ పర్యటన.. తమ్మిలేరు రిటైనింగ్‌ వాల్‌కు శంకుస్థాపన

ఏపీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఈరోజు పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో పర్యటించారు. పది నిమిషాల్లో ఏలూరులో సీఎం జగన్ మోహన్ రెడ్డి పర్యటన పూర్తయింది. ఈ పర్యటనలో భాగంగా తమ్మిలేరు రిటైనింగ్ వాల్ కు సీఎం జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన చేశారు. అనంతరం వీవీనగర్‌ వద్ద ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను సందర్శించారు. అక్కడ నుంచి నేరుగా కళ్యాణమండపానికి చేరుకొని మాజీ మేయర్‌ షేక్‌ నూర్జహాన్‌, పెదబాబు కుమార్తె వివాహానికి హాజరై.. నూతన వధూవరులను ఆశీర్వదించారు. తిరిగి హెలిప్యాడ్‌ వద్దకు చేరుకొని తాడేపల్లికి బయలుదేరారు.