సీఎం జగన్ పెళ్లిరోజు.. ఎమ్మెల్యే భారీ కటౌట్..!

ఈ రోజు ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆయన సతీమణి భారతి 25వ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు సంబురాలు జరుపుకుంటున్నారు. సోషల్ మీడియాలో జగన్ అభిమానులు, వైసీపీ నాయకులు శుభాకాంక్షలు చెబుతూ పోస్టులు పెడుతున్నారు. ఈ నేపథ్యంలోనే శ్రీకాలహస్తి వైసీపీ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి జగన్ భారతిల భారీ కటౌట్ ను ఏర్పాటు చేశారు.

ప్రస్తుతం ఈ కటౌట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కటౌట్ లో సీఎం దంపతుల ఫోటోలను అందంగా చిత్రించారు. ఇక పెళ్లి రోజు సంధర్బంగా జగన్ దంపతులు సిమ్లా టూర్ కు వెళ్లిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా సీఎం జగన్ భారతి దంపతులు అన్యోన్య దంపతులుగా రాష్ట్ర ప్రజలకు ఆదర్శంగా నిలుస్తున్నారు.