సింగరేణిలో కారుణ్య నియామకాలపై స్పందించిన సీఎం కేసీఆర్

శాసనసభ వేదికగా సింగరేణిలో కారుణ్య నియామకాలపై ముఖ్యమంత్రి కేసిఆర్ స్పందించారు. సింగరేణి కారుణ్య నియామకాలపై అసెంబ్లీలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు కెసిఆర్ సమాధానం ఇస్తూ.. చదువుకు సమానస్థాయిలో పోస్టులు ఖాళీగా ఉంటే, కారుణ్య నియామకాలు చేపడుతామని ఆయన స్పష్టం చేశారు. పోస్టులు సృష్టించి ఇవ్వబడవు అని స్పష్టం చేశారు. సంస్థ మంచి, చెడులు వారికి తెలియాలి. ఈ క్రమంలో వారిని తక్షణమే జనరల్ మజ్దూర్ గా తీసుకుంటాం. కొద్ది రోజులు వారికి శిక్షణ ఇచ్చి అప్‌గ్రేడ్ చేసి పోస్టులోకి తీసుకుంటాం అని కేసీఆర్ స్పష్టం చేశారు. సింగరేణి కార్మికులకు ఇన్‌కం ట్యాక్స్ రద్దు చేయాలని ప్రధాని మోదీని అనేకసార్లు కోరామని తెలిపారు. కేంద్రం పట్టించుకోవడం లేదు. సింగరేణి కార్మికుల సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామన్నారు. రిటైర్ అయిన సింగరేణి కార్మికులను గౌరవించాలి. పదవీ విరమణ చేసి రోజునే అన్ని ఇచ్చి గౌరవంగా పంపాలి అని సీఎం సూచించారు. కారుణ్య నియామకాలు వీలైనంత త్వరగా పూర్తయ్యేలా చూస్తామని సీఎం స్పష్టం చేశారు.