ధరణి పోర్టుల్‌ పై సిఎం కెసిఆర్‌ సమీక్ష

ధరణి పోర్టల్‌ రూపకల్పనపై సీఎం కేసీఆర్‌ ఉన్నతాధికారులతో ఈ రోజు  సమీక్ష నిర్వహించనున్నారు. రెవెన్యూ సంస్కరణల్లో భాగంగా రెవెన్యూ రికార్డులను పారదర్శకంగా నిర్వహించడానికి ధరణి పోర్టల్ రూపకల్పన జరగాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తున్నది. కొత్త రెవెన్యూ చట్టం అమలు, విధివిధానాలపై సమావేశంలో సీఎం అధికారులతో సమీక్షించనున్నట్లు తెలుస్తోంది. పట్టణ, పురపాలక పన్నురికార్డులను అనుసంధానం చేసే అంశంపైనా చర్చించనున్నట్లు సమాచారం. భూదస్త్రాల నిర్వహణపై సీఎం కేసీఆర్‌ ప్రత్యేక దృష్టి పెట్టడంతో సమావేశానికి ప్రాధాన్యం ఏర్పడింది. ఈ పోర్టల్ రూపకల్పనకు సమగ్ర సమాచారంతో రావాలని అధికారులను సిఎం ఆదేశించారు.