రాష్ట్రంలో వరదలపై సీఎం కేసీఆర్‌ సమీక్ష

రాష్ట్రవ్యాప్తంగా గత ఐదు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతున్న కారణంగా రాష్ట్రంలో వరదలపై సీఎం కేసీఆర్‌ ఆరా తీశారు. వర్ష ప్రభావం ఎక్కువ ఉన్న జిల్లాల కలెక్టర్లను వివరాలు అడిగి కేసీఆర్‌ తెలుసుకున్నారు. భారీ వర్షాల కారణంగా చెరువులు, కుంటలు నిoడిపోయాయి. పలు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. అధికారులు ఎక్కడికక్కడ సహాయక చర్యలు చేపట్టి.. ముంపు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు. పలు చోట్ల పంటలు దెబ్బ తిన్నాయి. ఎడతెరిపిలేకుండా కురుస్తున్న భారీవర్షాలు ఉత్తర తెలంగాణను అతలాకుతలం చేస్తున్నాయి.