రిజర్వేషన్లపై సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అగ్రవర్ణ పేదలకు 10శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని నిర్ణయించారు. ఆర్ధికంగా వెనుకబడిన అగ్ర వర్ణాలకు 10శాతం EWS రిజర్వేషన్లను వర్తింపజేయాలని నిర్ణయం తీసుకున్నారు. EWS రిజర్వేషన్ల అమలుపై రెండు రోజుల్లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనున్న సీఎం కేసీఆర్ ఎప్పట్నుంచి ఎలా అమలు అమలు చేయాలో కార్యాచరణ రూపొందించనున్నారు. 10శాతం EWS రిజర్వేషన్ల అమలుతో తెలంగాణలో 60శాతానికి చేరనున్నాయి.