నేడు తిరుమలలో పౌర్ణమి గరుడ సేవ

తిరుమల: తిరుమలలో శనివారం పౌర్ణమి గరుడ సేవ జరగనుంది. రాత్రి 7 నుంచి 9 గంటల వరకు తిరుమాడ వీధుల్లో.. గరుడ వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమివ్వనున్నారు. కాగా తిరుమలలో భక్తుల రద్దీ భారీగానే ఉంది. నిన్న శ్రీవారిని 51,368 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. 23,519 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు.