రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్‌ దీపావళి శుభాకాంక్షలు

తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఇంటి లోగిలి కార్తీక దీపకాంతులతో వెలుగు లీనాలని, అన్నదాత కళ్లల్లో ఆనందపుకాంతులు వెల్లి విరియాలని కేసీఆర్‌ ఆకాంక్షించారు. అజ్ఞానాంధకారాలు తొలగించే విజ్ఞానపు వెలుగును దీపావళి ప్రసాదించాలని వేడుకున్నారు.