NBCC లో 100 ఇంజినీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ NBCC Ltd లో ఖాళీగా ఉన్న ఇంజినీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలయ్యింది. ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులను కోరుతున్నది. ఆన్‌లైన్ దరఖాస్తులు వచ్చేనెల 15 వరకు అందుబాటులో ఉంటాయని తెలిపింది.

పోస్టులు వివరాలు:

మొత్ం పోస్టులు: 100

సివిల్ ఇంజినీర్-80 (జనరల్‌-34, ఓబీసీ-20, ఎస్సీ-13, ఎస్టీ-6, ఈడబ్ల్యూఎస్‌-7)

ఎలక్రికల్ ఇంజినీర్-20 (జనరల్‌-10, ఓబీసీ-5, ఎస్సీ-3, ఎస్టీ-1, ఈడబ్ల్యూఎస్‌-1).

అర్హత: బీఈ లేదా బీటెక్‌లో సివిల్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి. సంబంధిత రంగంలో రెండేండ్ల అనుభవం తప్పనిసరి.

ఎంపిక ప్రక్రియ: రాతపరీక్ష లేదా ఇంటర్వ్యూ.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో. హార్డ్‌కాపీని ప్రింట్ తీసి, అవసరమైన సర్టిఫికెట్లను జతచేసి సంబంధిత చిరునామాకు పంపించాలి.

అప్లికేషన్ ఫీజు: రూ.500, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు.

దరఖాస్తులకు చివరితేదీ: డిసెంబర్ 15

పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: www.nbccindia.com