కె.పి.హెచ్.బిలో కాలనీ మోడీ మీట్ & గ్రీట్

కె.పి.హెచ్.బి కాలనీ 5వ ఫేస్ పార్క్ నందు మోడీ మీట్ & గ్రీట్ కార్యక్రమములో భాగంగా బిజెపి మల్కాజిగిరి పార్లమెంట్ అభ్యర్ధి ఈటెల రాజేందర్ ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరవడం జరిగింది. ఈ సందర్భంగా కూకట్పల్లి నియోజకవర్గ జనసేన కంటెస్టెడ్ ఎమ్మెల్యే ప్రేమ కుమార్ రాజేందర్ ని సాదరంగా ఆహ్వానించారు. కొద్దిసేపు పార్క్ లోని వాకర్స్ మరియు జనసేన నాయకులు, బీజేపి నాయకులతో కలసి అల్పాహారం స్వీకరించారు. ఈ సందర్భంగా ఈటెల రాజేందర్ మాట్లాడుతూ మల్కాజిగిరిలో స్వయంగా భారత ప్రధానమంత్రి మోడీ ఎన్నికల ప్రచారం ప్రారంభించడం జరిగిందని, యావత్ తెలంగాణ మోడీ ఆలోచనతో 370 సీట్లకు పైగా బీజేపీ సొంతంగా గెలవాలనే నినాదాన్ని నిజం చేయాలని, దాంట్లో మల్కాజిగిరి కూడా ఉండాలని చెప్పి వారు సమర శంఖం పూరించడం జరిగిందన్నారు. తెలంగాణ ఉద్యమకారుడిగా నా చరిత్ర మీ కళ్ళ ముందు కదలాడుతుంది అని ఏ అకుంఠిత దీక్ష కోసమైతే పోరాడేమో అదంతా మీ కళ్ళ ముందు ఉంది అని తొలి ఆర్థిక మంత్రిగా, కరోనా సమయంలో ఆరోగ్య మంత్రిగా పనిచేసిన విషయం కూడా మీరు చూశారని, మల్కాజ్గిరిలో పార్లమెంట్ అభ్యర్థిగా నేను మీ ముందుకి వచ్చాను అని, ఇక్కడ బిగ్గెస్ట్ ఛాలెంజ్ నిరుద్యోగం అని, భారత ప్రభుత్వ సహకారంతో స్కిల్ డెవలప్మెంట్ సంస్థలతో మేక్ ఇన్ ఇండియాను మేడిన్ ఇండియా అనే నినాదంతో ఈ నియోజకవర్గంలో ఉపాధి అవకాశాలు కల్పిస్తానని మాట ఇస్తున్నానని అన్నారు. కేంద్రంలో మోడీ సర్కారు ఉంది కాబట్టి దరఖాస్తు పెట్టి దండం పెట్టే అవసరం లేకుండా మీ బిడ్డగా వాటిని పరిష్కారం చేస్తాను అని ఈటల రాజేందర్ వ్యాఖ్యానించారు.

అనంతరం జనసేన పార్టీ ఆఫీస్ లో భగత్ సింగ్ వర్థంతిని పురస్కరించుకుని ప్రేమ కుమార్ పిలుపు మేరకు జనసేన పార్టీ ఆఫీసులో ఈటెల రాజేందర్ భగత్ సింగ్ చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఈటెల రాజేందర్ మాట్లాడుతూ
విప్లవానికి ఉరివేసిన రోజు: భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ వర్ధంతి నేడు అని, ఆ ముగ్గురు విప్లవానికి నిలువుటద్దంగా నిలిచారు అని, బ్రిటిష్ దుర్మార్గపు పాలనలో చిక్కుకున్న భారత దేశానికి విముక్తి కలిగించేలా.. దేశ ప్రజల్లో విప్లవ స్ఫూర్తిని నింపి భారత స్వాతంత్ర్యోద్యమాన్ని మరో మెట్టు ఎక్కించారు. మన స్వాతంత్య్రం మన చేతుల్లోనే ఉందని అని, భావించిన ఆ ముగ్గురు బ్రిటిష్ అధికారులపై తిరగబడ్డారు. ఆ ముగ్గురిలో దేశ ప్రజల్లో పోరాట స్ఫూర్తి జ్యాలలు రగిలించే శక్తిని గ్రహించిన అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం ఆ పోరాటాన్ని అణచివేసే ప్రయత్నం చేసింది అని, స్వాతంత్రోద్యమ తీవ్రవాదులుగా పేర్కొంటూ ముగ్గుర్ని ఒకేసారి ఉరి తీసింది బ్రిటిష్ ప్రభుత్వం. 1931 మార్చి 23న భారత స్వాతంత్ర విప్లవకారులు భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ లను బ్రిటిష్ ప్రభుత్వం ఉరి తీసింది. అని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో కూకట్ పల్లి నియోజకవర్గ జనసేన పార్టీ కో-ఆర్డినేటర్ లు, డివిజన్ నాయకులు బీజేపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డేపల్లి రాజేశ్వరరావు, బీజేపి మెడ్చల్ జిల్లా సెక్రెటరీ ప్రీతం రెడ్డి, సీనియర్ నాయకులు, మహిళా నాయకులు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.