సిసి రోడ్డు పనుల ప్రారంభం

రాజోలు నియోజకవర్గం: మామిడికుదురు మండలం, లూటుకుర్రు గ్రామంలో ఫైనాన్స్ 2 లక్షలు, ఎంపీటీసీ నిధులు 2 లక్షలతో సిసి రోడ్డు పనులను గ్రామ సర్పంచ్, మామిడికుదురు మండల సర్పంచుల సమాఖ్య అధ్యక్షులు అడబాల తాతకాపు, ఎంపీటీసీ సభ్యులు నామన వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ కోట బ్రహ్మానందం, వార్డు సభ్యులు బోనం అబ్బులు, రొక్కం తేజేశ్వరరావు మరియు గ్రామ పెద్దలు పాల్గొన్నారు.