ఏపీ రేషన్ కార్డుతో తెలంగాణలో సరుకులు

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం తెలంగాణలో ఉన్న ఏపీ వాసులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఏపీలో ప్రజా పంపిణీ వ్యవస్థలో ఇప్పటివరకు రాష్ట్ర పరిధిలో ఉన్న పోర్టబిలిటీ విధానాన్ని అంతర్రాష్ట్రాల్లోనూ అమలు చేస్తున్నారు. ఉపాధి పనుల నిమిత్తం ఏపీ నుంచి తెలంగాణకు వలస వెళ్లిన పేదలకు అంతర్రాష్ట్ర పోర్టబిలిటీతో సరుకులు ఇస్తున్నారు.

ఇప్పటికే ఏపీ రేషన్ కార్డులున్న కొంత మంది తెలంగాణలో బియ్యంతో పాటు ఇతర సరుకులు అందించారు. కాగా, కేంద్రం.. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలను ఒక క్లస్టర్‌గా గుర్తించి ఎక్కడైనా సరుకులు తీసుకునే విధానాన్ని అమల్లోకి తెచ్చింది. ఎలాంటి ఇబ్బందులు లేకుండా దిగ్విజయంగా అమలైతే దేశంలో ఎక్కడైనా సరుకులు తీసుకునే విధానాన్ని అమల్లోకి తీసుకురావాలనే ఆలోచనలో ఉన్నారు.