బస్‌భవన్‌ ముట్టడిoచిన అద్దెబస్సుల యజమానులు

అద్దెబస్సుల యజమానులు బస్‌భవన్‌ ముట్టడిoచడానికి యత్నించారు. ఈ క్రమంలో బస్ భవన్ ఎదుట ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పెండింగ్‌ బిల్లులను పెండింగ్‌లో ఉన్న బిల్లులను విడుదల చేయాలంటూ డిమాండ్‌ చేశారు. 25 శాతం బస్సులను మాత్రమే నడిపించేందుకు ఆర్టీసీ అనుమతిచ్చిందని, వాటికి కూడా సరిగ్గా బిల్లులు చెల్లించడం ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ఆర్థికంగా నష్టపోతున్నామని వారంతా వాపోయారు. తమపై ఆధారపడిన చాలా కుటుంబాలు రోడ్డున పడిపోతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. అద్దె బస్సుల యజమానులను అరెస్టు చేస్తున్నారని బాధిత డ్రైవర్లు, క్లీనర్లు ఆరోపించారు. జిల్లాల నుంచి వచ్చే అద్దె బస్సులను అడ్డుకుంటున్నారని అన్నారు. బస్‌బవన్‌ వైపు దూసుకెళ్తున్న ఆందోళన కారులను పోలీసులు అడ్డుకున్నారు.