జనసేన మీద అభ్యంతరకర బ్యానర్లను తొలగించాలని జిల్లా ఎస్పీకి ఫిర్యాదు..

నెల్లూరు నగరంలోని స్థానిక ఎస్పీ కార్యాలయం నందు నెల్లూరు జిల్లా జనసేన జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి నెల్లూరు జిల్లా ఎస్పీ తిరుమలేశ్వర్ రెడ్డిని కలిసి నెల్లూరు జిల్లాలో జనసేన పార్టీ మీద అభ్యంతరకర బ్యానర్లను తొలగించాలని విజ్ఞప్తి చేశారు. నెల్లూరు జిల్లా లో జనసైనుకుల మీద కేసులు నమోదు చేయవద్దు అని జిల్లా ఎస్పీ గారిని కోరటం జరిగింది. దానికి అయన సానుకూలంగా స్పందిస్తూ ఇప్పుడు వరకు ఎక్కడా కేసులు పెట్టలేదు అని అన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ త్వరలో బ్యానర్లన్నీ తొలగిస్తామని, నగరపాలక కమిషనర్ కు విషయాన్ని తెలియజేసి అతి త్వరలో తొలగిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు తమ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షులు దుగ్గిశెట్టి సుజయ్ బాబు, జనసేన కార్యనిర్వాహక కార్యదర్శి కొట్టే వెంకటేశ్వర్లు, ఆలియా, వెంకటేష్, శ్రీకాంత్, ఉదయ్, కిరణ్, తదితరులు పాల్గొన్నారు.