ఎన్నికల విధులకు 45వేల మాస్టర్‌ ట్రైనర్లకు శిక్షణ పూర్తి

జీహెచ్‌ఎంసీ ఎన్నికల విధుల్లో 45వేల మంది అధికారులు, సిబ్బంది పాల్గొననున్నారు. గ్రేటర్‌లోని మూడు జిల్లాలే కాకుండా మరో 11జిల్లాలకు చెందిన ఉద్యోగులను ఎన్నికల విధుల్లో నియమించినట్టు అధికారులు పేర్కొన్నారు. 45 వేల మందిలో 20 వేల మంది పీవోలు, ఏపీవోలకు సంబంధిత జిల్లాల్లోనే ఎన్నికల శిక్షణ ఇప్పించేందుకు ఏర్పాట్లు చేశారు. మరోవైపు, 431 మంది రిటర్నింగ్‌, అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ అధికారులకు ఇదివరకే శిక్షణను పూర్తిచేయగా, బుధవారం జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో మాస్టర్‌ ట్రైనర్లకు శిక్షణనిచ్చారు.