జనసేన పార్టీ కార్యకర్త మృతికి సంతాపం

కుప్పం, రామకుప్పం మండల పరిధిలోని వీర్ణమాల పెద్ద తండా గ్రామపంచాయతీ బండ కొత్తూరు తండా గ్రామంలో జనసేన పార్టీ క్రియాశీలక కార్యకర్త శివ నాయక్ అనారోగ్యంతో శుక్రవారం మృతి చెందారు రామకుప్పం జనసేన పార్టీ మండల అధ్యక్షుడు హరీష్ జిల్లా కార్యదర్శి రామమూర్తి మండల నాయకులు శ్రీకాంత్, భాస్కర్, పవన్, సురేష్, సోమునాయక్, రాజేష్ నాయక్, తాంజిల్ బాషా, బాబు, సంతోష్ నాయక్, రాజేంద్ర నాయక్ తదితరులు బండ కొత్తూరు తండా గ్రామానికి వెళ్లి శివ నాయక్ పార్దివదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అలాగే వారి కుటుంబానికి జనసేన పార్టీ తరపున 10 వేల రూపాయలు ఆర్థికసాయం అందజేయడం జరిగింది.