పసుపు రైతులకు మద్దతుగా కాంగ్రెస్ ఒక రోజు దీక్ష

జిల్లాలోని రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. పసుపు బోర్డు ఏర్పాటు, పసుపు పంటకు కనీస మద్దతు ధర కోసం గత కొన్ని రోజులుగా పసుపు రైతుల ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో రైతులు ఆందోళన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వారికి మద్దతుగా జిల్లాలోని ఆర్మూర్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్యర్యంలో ఒక రోజు దీక్ష నిర్వహిస్తున్నారు. దీక్షకు కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ రేవంత్ రెడ్డి హాజరవుతున్నారు. దీక్ష కోసం జిల్లా కాంగ్రెస్ నాయకులు అన్ని ఏర్పాట్లు చేశారు. జిల్లాలోని అన్ని ప్రాంతాల నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులు హాజరు కానున్నారు.

తనను ఎంపీగా గెలిపిస్తే ఐదు రోజుల్లో పసుపు బోర్డు తెస్తానని ఎంపీ అర్వింద్‌ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే కేంద్ర ప్రభుత్వం పసుపు బోర్డుకు బదులుగా స్సైసెస్ బోర్డు ప్రాంతీయ కార్యాలయాన్ని ఏర్పాటు చేసింది.