కృష్ణానది రిటైనింగ్‌ వాల్‌కు సిఎం శంకుస్థాపన

విజయవాడ: విజయవాడ కనకదుర్గమ్మ వారధి నుంచి కోటినగర్‌ వరకు కృష్టా నది ఎడమవైపున వరద రక్షణ గోడ (రిటైనింగ్‌ వాల్‌) నిర్మాణానికి సిఎం వైఎస్‌ జగన్‌ బుధవారం శంకుస్ధాపన చేశారు. 1.5 కిలోమీటర్ల మేర రూ.122.90 కోట్ల వ్యయంతో కృష్ణా నది వరద ఉధృతిని తట్టుకునేలా రిటైనింగ్‌ వాల్‌ను నిర్మించనున్నారు. ఈ గోడ నిర్మాణంతో కృష్ణా నది కరకట్టకు చెందిన రాణీగారితోట, తారకరామానగర్‌, భూపేష్‌గుప్తా నగర్‌ ప్రాంతాలలో నివాసముంటున్న సుమారు 31 వేల మంది ప్రజలకు వరద ముంపు నుంచి శాశ్వత ఉపశమనం కలుగనుంది. ఈ కార్యక్రమంలో మంత్రులు వెలంపల్లి శ్రీనివాసరావు, కొడాలి వెంకటేశ్వరరావు (నాని), పేర్ని వెంకట్రామయ్య (నాని), అనిల్‌కుమార్‌ యాదవ్‌, బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ విప్‌ సామినేని ఉదయభాను, బ్రాహ్మణ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ మల్లాది విష్ణు, ఎమ్మెల్సీ కరీమున్నిసా, ఎమ్మెల్యేలు కైలే అనిల్‌కుమార్‌, మొండితోక జగన్‌మోహన్‌రావు, కొలుసు పార్ధసారధి, కొఠారి అబ్బయ్య చౌదరి, జోగి రమేష్‌, గుడివాడ అమర్‌నాథ్‌, సింహాద్రి రమేష్‌, ఎంపి లు వల్లభనేని బాలశౌరి, నందిగం సురేష్‌, మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ, తలశిల రఘురామ్‌, విజయవాడ నగర మేయర్‌ రాయన భాగ్యలక్ష్మి, ఎపి ఫైబర్‌నెట్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ గౌతమ్‌రెడ్డి, విజయవాడ ఈస్ట్‌ వైసిపి సమన్వయకర్త దేవినేని అవినాష్‌, వైసిపి నేత పొట్లూరి వరప్రసాద్‌, స్ధానిక నేతలు, ప్రభుత్వ ఉన్నతాధికారులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.