మెగాస్టార్ ఫ్యాన్స్ కి అదిరిపోయో సర్ ప్రైజ్…!

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఆచార్య సినిమా విడుదలకు ముందే ఫ్యాన్స్ ను ఉర్రూతలూగిస్తోంది. ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తుండగా.. తొలి పాటను మార్చి 31 సాయంత్రం 4.05 నిమిషాలకు విడుదల చేస్తామని మేకర్స్ అనౌన్స్ చేశారు. అయితే గడువుకు ముందే అదిరిపోయో సర్ ప్రైజ్ ఇచ్చారు చిత్ర యూనిట్ సభ్యులు. లాహే లాహే అంటూ సాగే ఈ పాటకు సంబంధించిన చిన్న ప్రోమోను ఒక్కరోజు ముందుగానే రిలీజ్ చేశారు దర్శక నిర్మాతలు. లిటిల్ బిట్ లో చిరంజీవి వేసిన అదిరిపోయే స్టెప్ అభిమానులను ఆకట్టుకుంటోంది. నక్సల్ బ్యాక్ డ్రాప్ తో వస్తున్న ఈ మూవీలో మెగాస్టార్ డ్యాన్స్ స్టెప్పులు మిస్ అవుతామేమో అనుకున్న అభిమానులు ఈ వీడియో చూసి సంబరపడిపోతున్నారు. బాస్ ఈజ్ బ్యాక్ అంటూ మురిసిపోతున్నారు.