నిడదవోలు జనసేన ఆధ్వర్యంలో యర్ర కాలువ బ్రిడ్జి వద్ద రోడ్డు నిర్మాణం

నిడదవోలు నియోజకవర్గం, నిడదవోలు మండలం, కంసాలీపాలెం గ్రామంలో గాంధీ జయంతి రోజున నిడదవోలు మండలం అధ్యక్షులు పోలీరెడ్డి వెంకటరత్నం(పి.వి.ఆర్) నిరాహార దీక్ష అనంతరం కంసలిపాలెం – మాధవరం గ్రామ రైతులకు ఇచ్చిన మాట ప్రకారం, వరద ప్రభావం తగ్గడంతో జనసేనపార్టీ నిడదవోలు ఆధ్వర్యంలో యర్ర కాలువ బ్రిడ్జి వద్ద రోడ్డు వేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పోలిరెడ్డి వెంకటరత్నం మాట్లాడుతూ ప్రభుత్వం చేయాల్సిన పని జనసేన పార్టీ చేసిందని, ప్రతి సమస్యపై పోరాటం మాత్రమే కాకుండా అవసరమైన మేరకు పరిష్కారం కూడా జనసేన పార్టీ చూపుతుందని మాట్లాడారు. ఇప్పటికి అయినా ప్రభుత్వం స్పందించి బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో నిడదవోలు మండలం ప్రధాన కార్యదర్శులు పాలకోడేటి గోపినాధ్, షేక్ రఫీ, అంబటి శ్యామ్ సుందర్, ప్రోగ్రాం కమిటీ సభ్యులు యమన కాశీ, యడ్లపల్లి సత్తిబాబు, సంయుక్త కార్యదర్శి సేపేనా దుర్గ ప్రసాద్, కంసాలీపాలెం గ్రామ అధ్యక్షులు కోయి దుర్గప్రసాద్ మరియు నార్ని నానాజీ, కస్తూరి వెంకటసుబ్బారావు, సురేంద్ర యువ నాయకులు శివసాయి, నిడదవోలు మండలం జనసేన నాయకులు, జనసైనికులు, రైతులు పాల్గొన్నారు.