దాదాపు రెండురెట్లు పెంచిన అయోధ్య మందిర నిర్మాణం

ముందుగా అనుకున్న ప్రణాళిక కన్నా నిర్మాణ పరిమాణాన్ని దాదాపు రెండురెట్లు పెంచారు. ఆలయాన్ని నాగర్‌ శైలిలో నిర్మిస్తూ మూడున్నర ఏళ్లలో నిర్మాణాన్ని పూర్తి చేయనున్నారు. ఆలయాన్ని పూర్తిగా వాస్తు శాస్త్రానికి అనుగుణంగా నిర్మిస్తామని ప్రధాన స్తపతి చంద్రకాంత్‌ భాయ్‌ సోంపూర చెప్పారు. గుజరాత్‌లో అక్షరథామ్‌ ఆలయానికి రూపకల్పన చేసింది ఈయనే. చంద్రకాంత్‌ తాత ప్రభాకర్జీ సోంపూర, సోమ్‌నాథ్‌ ఆలయానికి నమూనాను రూపొందించారు. పది ఎకరాల్లో ఆలయాన్ని నిర్మిస్తారు. మిగిలిన 57 ఎకరాలను ఆలయ కాంప్లెక్స్‌గా అభివృద్ధి చేస్తారు. ముందుగా ప్రణాళిక ప్రకారం 141 అడుగులతో నిర్మించాలనుకున్నారు. దీన్ని తాజాగా 161 అడుగులకు పెంచారు.