తాండూరు అభివృద్ధికి పాటుపడుతా – శంకర్ గౌడ్

తెలంగాణ, తాండూరు: వికారాబాద్ జిల్లా, తాండూర్ పట్టణం ఉమ్మడి బిజెపి జనసేన అభ్యర్థి శంకర్ గౌడ్ ఆధ్వర్యంలో మంగళవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యఅతిథిగా విచ్చేసిన సినీ యాక్టర్ సాగర్ (ఆర్కే నాయుడు) పాల్గొని మన మార్పు కోసం, మన భవిష్యత్తు కోసం, మనం వేసే ఓటు మన చేతుల్లో ఉంది. నరేంద్ర మోడీ గారి ఆశయాలతో శంకర్ గౌడ్ కి మీ అమూల్యమైన ఓటుని గాజు గ్లాస్ గుర్తుపై వేసి గెలిపించాలని ఒక సేనానితో మొదలైన ఉద్యమం ఇప్పుడు తెలంగాణలో కూడా వ్యాపించింది. అన్ని వర్గాల అభివృద్ధి కోసం తెలంగాణలో పోటీ చేయడం జరిగిందని మీ అందరికి తెలుసని నిజాయితీకి మారుపేరు జనసేన పార్టీ అని దయచేసి ఆలోచించి ఓటు వేసి భవిష్యత్ తరాల మార్పు కోసం నేమూరి శంకర్ గౌడ్ గారిని గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళీ కలుద్దాం మన తాండూర్లో జై జనసేన అని పేర్కొన్నారు. తాండూరు నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ బలపరిచిన జనసేన అభ్యర్ది నేమూరి శంకర్ గౌడ్ మాట్లాడుతూ తాండూరు నియోకజవర్గ అభివృద్ధి జనసేన బీజేపీతోనే సాధ్యం ఇప్పటివరకు తాండూరులో గెలిచిన వారు తాండూరుని అభివృద్ధి చేయడంలో విఫలం అయ్యారు. గత ఎన్నికలో ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో పైలట్ రోహిత్ రెడ్డి విఫలం అయ్యారు. తాండూరు నియోజకవర్గం పొల్యూషన్ తో నిండిపోయినది కంది బోర్డు వేర్పాటు చేస్తా అన్నారు. దాని ఊసే లేదు. దోచుకోవటం దాచుకోవటం తప్ప తాండూరు నియోజకవర్గంలో చేసింది ఎం లేదు. దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు తెలంగాణ ముఖ్యమంత్రి బీసీని కేటాయించడం ఒక్కసారిగా తెలంగాణలో భారతీయ జనతా పార్టీఊపుఅందుకుంది. రాష్ట్రంలో బీజేపీ కచ్చితంగా గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది ఇద్దరు రెడ్డిలు. ఈపార్టీకి ఆపార్టీకి జంప్ చేసే వ్యక్తులే నేను మాత్రం తాండూరు అభిరుద్దికి పాటుపడుతా ఒక బిసి ని అయిన నన్ను తాండూరు నియోజకవర్గం ప్రజలు ఆశీర్వదించాలి అని మనసుపూర్తిగా కోరుకుంటున్నానని శంకర్ గౌడ్ తెలిపారు. కార్యక్రమంలో బిజెపి నాయకులు జిల్లా ప్రధాన కార్యదర్శి యు రమేష్ కుమార్, జనసేన పార్టీ సెంట్రల్ ఆఫీస్ ఆబ్సర్వర్ రాష్ట్రం కార్యదర్శి మండల రాజేష్, జనసేన కార్యకర్తలు రవీందర్, రామన్న షోరూమ్ రాజు, పవన్, అమ్రేష్, వెంకట్ తదితరులు పాల్గొన్నారు.