కాపులు బిచ్చగాళ్లు కాదు జగన్!

  • అనంతపురం జిల్లా జనసేన ఉపాధ్యక్షులు కుంటిమద్ది జయరాం రెడ్డి

అనంతపురం: కాపులు బిచ్చగాళ్లు కాదు జగన్ అని అనంతపురం జిల్లా జనసేన ఉపాధ్యక్షులు లాయర్ కుంటిమద్ది జయరాం రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కాపు ద్రోహి జగన్మోహన్ రెడ్డి గారు.. ఎన్నికల ముందు సంవత్సరానికి 2000 కోట్లు చొప్పున ఐదేళ్ల కు 10,000 కోట్లు కాపు సంక్షేమానికి అందిస్తానని ఓట్లు వేయించుకొని కాపుల్ని దగా చేస్తూ మోసం చేస్తున్నాడు. కాపు అక్కచెల్లెమ్మల్లారా ఒక మారు ఆలోచించండి సంవత్సరానికి 15000 అంటే నెలకి ఎంత? 15000÷12=1250 రూపాయలు…రోజుకు ఎంత? 15000÷365=41 రూపాయలు? సంక్షేమ పథకాల పేరుతో కొన్ని వర్గాల ప్రజలకు సంవత్సరానికి ఇంచుమించు 15 వేల రూపాయలు ఇస్తున్నాడు సంక్షేమ పథకాలు తీసుకుంటున్న ప్రతి ఒక్కరు ఆలోచించవలసిన తరుణం ఆసన్నమైంది, ఒక మారు లోతుగా ఆలోచన చేయండి. సంక్షేమ పథకాలు రూపంలో రోజుకు 41 రూపాయలు ఇస్తే.. పెరిగిన విద్యుత్ చార్జీల బిల్లులు కట్టుకోవాలా? చెత్త బిల్లు కట్టుకోవాలా? ఇండ్లకు పెంచిన హౌస్ టాక్స్ లు కట్టుకోవాలా? నిత్యవసర అవసరాల ధరల పరిస్థితి ఏంటి? ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా ఎన్ని చెప్పాలి? రోజుకు 41 రూపాయలు ఏవరికి సరిపోతుంది? దీనికి సరిపోతుంది? సంక్షేమ పథకాల తీసుకుంటున్న వాళ్లు జగన్ రెడ్డి గారి దృష్టిలో బిచ్చగాళ్ళ? శాశ్వత ఉపాధి కల్పించకుండా బిచ్చగాళ్ళని చేస్తున్నారా?. కార్పొరేషన్ పేర్లతో కులాల వారిగా విడగొడుతున్నాడు? మూడు రాజధానుల పేరుతో ప్రాంతాల మద్య చిచ్చు పెట్టాలని చూస్తున్నాడు? రాష్ట్ర ప్రజలారా ఇప్పటికైనా ఆలోచించండి? రాష్ట్రంలో సంక్షేమ పథకాల పేరుతో లక్షల కోట్ల అప్పు చేసి రాష్ట్ర ప్రజలందరినీ మోసం చేస్తున్నాడు. రాష్ట్ర ప్రజలకు కావలసింది అభివృద్ధి? పిల్లలకు ప్రతిభకు తగిన ఉద్యోగాలు, ఉపాధి కావాలి? జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు మీరు వేసే భిక్షం అవసరం లేదు? ఇప్పటికైనా మించి పోయింది లేదు నీకు చాతనైతే రాష్ట్రానికి ఫ్యాక్టరీలు తీసుకురా? పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులన్ని పూర్తిచేసి రాష్ట్ర ప్రజలకు శాశ్విత ఉపాధి, ఉద్యోగాలు కల్పించమని జయరాం రెడ్డి తెలిపారు.