ఐఐఎంలో కరోనా కలకలం.. 61 మంది విద్యార్థులకు కోవిడ్‌

కోల్‌కతాలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ (ఐఐఎం)లో కరోనా కలకలం సృష్టించింది. ఏప్రిల్‌ 2 నుండి చేపట్టిన పరీక్షల్లో 61 మంది విద్యార్థులకు కోవిడ్‌ సోకినట్లు నిర్ధారణ అయింది. ప్రస్తుతం వీరంతా ఐసోలేషన్‌ వార్డుల్లో ఉన్నారు. మార్చి చివరి నుండి కరోనా కేసులు బయటపడటంతో క్యాంపెస్‌లో రెండు భవనాలను బాధితులకు కేటాయించారు. అదేవిధంగా ముగ్గురు వైద్యులు వీరిని పర్యవేక్షిస్తున్నారు. క్యాంపస్‌లో కరోనా కేసులు పెరుగుతుండటంతో 570 మంది విద్యార్థుల ఐఐఎంను విడిచి వెళ్లిపోగా.. మిగిలిన 335 మంది అక్కడే ఉండగా.. వారిలో 61 మందికి కరోనా ఉన్నట్లు తేలింది. ప్రస్తుతం లక్షణాలు చాలా స్వల్పంగా ఉన్నాయని, ఆసుపత్రుల్లో చేరేంత పరిస్థితి లేదని ప్రొఫెసర్‌ ప్రశాంత్‌ మిశ్రా తెలిపారు. కరోనా దేశ వ్యాప్తంగా కోరలు చాచుతోంది. సోమవారం ఒక్కరోజే లక్షన్నరకు పైగా కేసులు వెలుగుచూశాయి.