టాలీవుడ్ నటుడు పోసానికి కరోనా..

ఆసుపత్రిలో చేరికటాలీవుడ్ ప్రముఖ నటుడు పోసాని కృష్ణమురళి కరోనా బారినపడ్డాడు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా వెల్లడించారు. తనతోపాటు కుటుంబ సభ్యులకు కూడా కరోనా సంక్రమించిందని, గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నామని పేర్కొన్నారు.

కరోనాతో ఆసుపత్రిలో చేరడంతో తాను నటిస్తున్న రెండు సినిమాల షూటింగులు వాయిదా పడినట్టు తెలిపారు. తన కారణంగా ఇబ్బందులకు గురైన దర్శక నిర్మాతలు, హీరోలు క్షమించాలని కోరారు. అందరి ఆశీస్సులతో త్వరలోనే కరోనా నుంచి కోలుకుని బయటపడతానని పోసాని ధీమా వ్యక్తం చేశారు.