బాలీవుడ్ స్టార్ సన్నీ డియోల్‌కు కరోనా పాజిటివ్

మన దేశంలో కరోనా తగ్గుముఖం పడుతున్నా.. ఇప్పటికీ పలువురు సెలబ్రిటీలు కరోనా బారినపడుతున్నారు. తాజాగా బీజేపీ ఎంపీ, బాలీవుడ్ స్టార్ సన్నీ డియోల్‌కు కరోనా కరోనా బారినపడ్డారు. పంజాబ్‌లోని గురుదాస్‌పూర్‌ పార్లమెంట్‌ నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్న ఆయన గత కొన్నిరోజులుగా హిమాచల్‌ప్రదేశ్‌లోని కులు మనాలీలో ఉంటున్నారు. ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్‌గా తేలిందని.. హిమాచల్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ కార్యదర్శి అమితాబ్ అవస్థి వెల్లడించారు. సన్నీడియోల్ ఇటీవలే కుడిభుజానికి శస్త్రచికిత్స చేయించుకున్నారు. ఆయన కొద్దిరోజులుగా కులూలోని తన ఫామ్‌హౌస్‌లో విశ్రాంతి తీసుకుంటున్నారు. ముంబైకి తిరిగి వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్న క్రమంలోన సన్నీడియోల్ కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది.