ఏపీ డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణికి కరోనా

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. సామాన్యులతోపాటే పలువురు ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు కూడా వరుసగా మహమ్మారి బారినపడుతున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. దాంతో ప్రస్తుతం ఆమె విశాఖపట్నంలోని ఓ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఆమె భర్త పరిక్షిత్‌ రాజుకు కూడా ఇటీవలే కరోనా సోకింది.