కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న సీపీ అంజనీ కుమార్‌

రాష్ట్రంలో రెండో విడుత కరోనా వ్యాక్సినేషన్ లో భాగంగా పాతబస్తీలోని పేట్లబర్జులో ఉన్న నగర పోలీసు శిక్షణా కేంద్రంలో హైదరాబాద్‌ సీపీ అంజనీ కుమార్‌ వ్యాక్సిన్‌ తీసుకున్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, కరోనా టీకా సురక్షితమని సీపీ అంజనీ కుమార్ అన్నారు. వ్యాక్సినేషన్‌కు చాలా మంచి స్పందన వస్తున్నదని చెప్పారు. తనతోపాటు చాలా మంది అధికారులు వ్యాక్సిన్‌ తీసుకున్నారన్నారు. అదేవిధంగా పోలీసు సిబ్బంది తమ దగ్గర్లో ఉన్న వ్యాక్సిన్‌ కేంద్రాల్లో టీకా వేయించుకోవాలని సూచించారు.