అక్టోబర్ లోనే కరోనా వాక్సిన్: డొనాల్డ్ ట్రంప్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గుడ్ న్యూస్ చెప్పారు. కరోనా వైరస్ వ్యాక్సిన్ అక్టోబర్‌లోనే వస్తుందని ప్రకటించారు. ‘ఏదైనా కొత్త వ్యాక్సిన్‌ను కనుగొనేందుకు సాధారణంగా సంవత్సరాల సమయం పడుతుంది. కానీ, అమెరికా ప్రభుత్వం వందల బిలియన్ డాలర్లు వెచ్చించి కరోనా వైరస్ వ్యాక్సిన్ ప్రక్రియను వేగవంతం చేసింది. జనవరి 2021నాటికి మన దేశంలో పంపిణీ చేసేందుకు 300 మిలియన్ల డోసులను సిద్ధం చేసేందుకు ఆపరేషన్‌ వార్ప్‌ స్పీడ్‌ పేరుతో ఓ కార్యక్రమాన్ని ప్రారంభించాం’ అని తాజాగా ట్రంప్ తెలియజేశారు.

వ్యాక్సిన్ కనిపెట్టడంలో రష్యా, ఆక్స్ ఫోర్డ్ శాస్త్రవేత్తలు ముందంజలో ఉన్నారని తెలుస్తోంది. 2021 జులై వరకు కరోనా వైరస్ వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు. అయితే కంటే ముందే.. వచ్చే నెలలోనే కరోనా వాక్సిన్ తీసుకొస్తామని ట్రంప్ ప్రకటించి ఆశ్చర్య పరిచారు.