అమిత్ షాకు కరోనా పాజిటివ్

దేశంలో కరోనా విలయతాండవం చేస్తుంది. దేశంలోని అత్యున్నత స్థాయి వ్యక్తులకు కూడా కలవరపెడుతోన్న కరోనా, తాజాగా కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు కరోనా వైరస్ సోకింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ లో వెల్లడించారు. ఈ మేరకు తనకు కరోనా వచ్చిందని.. ఆస్పత్రిలో చికిత్స కోసం చేరానని ట్వీట్ చేశారు.

కరోనా వైరస్ లక్షణాలు కనిపించడంతో నేను టెస్టులు చేయించుకున్నాను. అందులో రిపోర్ట్ పాజిటివ్ గా వచ్చింది. నా ఆరోగ్యం బాగానే ఉంది. కానీ వైద్యుల సలహా మేరకు ఆస్పత్రిలో చేరుతున్నా. కొన్ని రోజులుగా నాతో కలిసిన వారంతా కరోనా టెస్టులు చేసుకోవాలని.. అందరూ హోం ఐసోలేషన్ లో ఉండాలని అమిత్ షా ట్వీట్ చేశారు.