జనసేనతోనే అవినీతి రహిత పాలన సాధ్యం

  • పవనన్న ప్రజా బాట 137వ రోజు
  • ఇంటింటికి కరపత్రాలను అందజేసిన జనసేన నాయకులు

రాజంపేట: జనసేనతోనే అవినీతి రహిత పాలన సాధ్యమని జనసేన రాష్ట్ర చేనేత వికాస కార్యదర్శి రాటాల రామయ్య, రాజంపేట జనసేన యువ నాయకుడు పోలిశెట్టి శ్రీనివాసులు అన్నారు. రాజంపేట జనసేన పార్టీ అసెంబ్లీ ఇంచార్జ్ మలిశెట్టి వెంకటరమణ ఆదేశాల మేరకు సుండుపల్లి జనసేన వీరమహిళ సుగుణమ్మ ఆధ్వర్యంలో గురువారం సుండుపల్లె మండలంలోని మడితాడు పంచాయతీలోని పలు గ్రామాలలో బెస్తపల్లి, బైనేనిమాలల్లి కొని రెడ్డిగారిపల్లి, నడిం తురకపల్లి, జీకే రాచపల్లిలో పవనన్న ప్రజా బాట 137వ రోజు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ రూపొందించిన మేనిఫెస్టోను ఇంటింటికి తిరిగి ప్రజలకు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పేద బడుగు బలహీన మధ్యతరగతి కుటుంబాల సంక్షేమమే ద్యేయంగా జనసేన పార్టీ కృషి చేస్తుందన్నారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే జనసేన అధికారంలోకి రావాలన్నారు. వైసిపి అరాచక పాలనను ప్రజలు దృష్టిలో పెట్టుకొని జరగనున్న ఎన్నికల్లో జనసేనకు ఒక్క అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో చౌడయ్య, కిషోర్, జనసేన వీరమహిళలు జెడ్డా శిరీష, లక్ష్మమ్మ మాధవి తదితరులు పాల్గొన్నారు.