వైసీపీ ప్రభుత్వం మహిళకు ఇచ్చే డ్వాక్రా గ్రూపుల్లో అవినీతి: ఎం.హనుమన్

విజయవాడ: గ్రామీణ మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు, స్వయం ఉపాధి కల్పనకు ప్రభుత్వం రుణాలిచ్చే డ్వాక్రాలో కూడా అవినీతి చోటుచేసుకొంటుదని జనసేన రాష్ట్ర బీసీ నాయకుడు మరియు న్యాయవాది ఎం. హనుమన్ మండిపద్దారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ చూసినా అవినీతి రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయి నుంచి కార్పొరేట్ స్థాయి వరకు కనీసం మహిళకు రుణాలిచ్చే డ్వాక్రాలో కూడా అవినీతి. మహిళకు రుణాలు కల్పించి అండగా ఉండే డ్వాక్రాకి ఆర్పీలు కమిషన్ పేరు మీద వసూలు చేస్తున్న పరిస్థితి మన ఆంధ్రప్రదేశ్ లో చూస్తున్నాం. 40 గ్రూపులకు జగన్ మోహన్ రెడ్డి ఆర్పీలు 2000 నుంచి 3000 వేల వరకు కమిషన్ తీసుకోనే పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అవినీతి ఎంత దారుణంగా ఉందంటే చిన్న స్థాయి ఉద్యోగులలో కూడా అవినీతి పెరిగి రాష్ట్రం అవినీతి పాలైతే ప్రశ్నించే గొంతుకు సంకెళ్లు వేస్తున్నారు. మానవ హక్కుకి ఆంధ్రప్రదేశ్ లో చోటు లేదు. మానవ హక్కుల గురించి మానవ హక్కుగా ప్రశ్నిస్తే.. ప్రశ్నించే గొంతుకు సంకెళ్లు వేస్తున్నారు. 2024లో మన రాష్ట్రానికి అభివృద్ధి జరగాలన్నా.. అవినీతి లేని పరిపాలన కావాలన్నా మనకు మంచి నాయకుడు కావాలి. ప్రజలకు అండగా ఉండే నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. ప్రజల సమస్యలపై పోరాడే నాయకుడు పవన్ కళ్యాణ్ గారిని మనం ఎన్నుకోవడం మన కనీసం బాధ్యత. 2024లో అభివృద్ధి జరగాలంటే, అవినీతి లేని సమాజం మనకు కావాలంటే మన విలువైన, అమూల్యమైన ఓటుని గాజు గ్లాస్ గుర్తుపై ఓటేయడం మన కనీస బాధ్యత అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ నేను తెలియజేస్తున్నాను. అవినీతి.. ఎక్కడ చూసినా అవినీతి.. ఏ మూల చూసినా అవినీతి.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మురికి పట్టినట్టు అవినీతి పట్టింది. జగన్మోహన్ రెడ్డిని అవినీతి పై ప్రశ్నిస్తే దౌర్జన్యం, రౌడీయిజం చేస్తారు. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్సిపి భారత రాజ్యాంగాన్ని వైఎస్ఆర్సిపి రాజ్యాంగంగా రాసుకుంది. ఇక్కడ ప్రశ్నించే హక్కు లేకుండా పోయింది. మహిళలు చిరు వ్యాపారాల కోసం రుణాలు తీసుకొని, వారి సొంత కాళ్ళ మీద నిలబడడం కోసం అండగా నిలవాల్సిన డ్వాక్రా గ్రూపులు కూడా అవినీతితో మహిళకు కన్నీళ్లు మిగిల్చాయి. మన భారత రాజ్యాంగం కల్పించిన హక్కు మాట్లాడే స్వేచ్ఛ మన బాధ్యత కనీసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి అధికారులకు వచ్చాక ఆ మాట్లాడే స్వేచ్ఛ కూడా ఈరోజు ప్రజలు కోల్పోయారు. కనీసం మహిళలు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవడానికి తీసుకునే తక్కువ వడ్డీ రుణాలు కూడా మహిళల కన్నీళ్లుగా మార్చాయి. ఎలాంటి అవినీతి లేని పరిపాలన మనకు కావాలి అంటే అభివృద్ధి ఉన్న రాష్ట్రం మనం చూడాలి అంటే మన కనీస బాధ్యత ఓటు.. మన అమూల్యమైన ఓటుని గాజు గ్లాస్ గుర్తుపై వేసుకొని రానున్న రోజుల్లో మంచి అభివృద్ధి చూద్దామని ఆశిస్తున్నామని ఎం. హనుమన్ తెలియజేసారు.