జగ్గయ్యపేట గ్రామం ఉపాధి హామీ కూలీలతో లోకం మాధవి

నెల్లిమర్ల: భోగాపురం మండలం, జగ్గయ్యపేట గ్రామంలో ఉపాధి హామీ పధకంలో భాగంగా పనిచేస్తున్న ఊరి ప్రజలను లోకం మాధవి స్వయంగా వారిని కలసి వారి సమస్యలు తెలుసుకున్నారు. ఊరిలో వివిధ సమస్యలు తెలుసుకున్న మాధవి వాటికి అతి త్వరలోనే పరిష్కారం దిశగా అడుగులు వేసి పోరాడతాం అని మాధవి తెలియజేశారు. ఈ సందర్భంగా మాధవి మాట్లాడుతూ.. ఇది ఎన్నికల సమయం కాదు అని కానీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ప్రజల్లోకి వెళ్లి అవగాహన కల్పించాలని, వారి సమస్యలు మీద పోరాడి వారికి న్యాయం జరిగేలా చూడాలి అని తెలియజేసారని, అందులో భాగం గానే ప్రజల్లో మమేకం అయ్యి వారి సమస్యల మీద పోరాటం చేస్తున్నాను అని తెలిపారు. నెల్లిమర్లలో ఇంతకముందు రైతులు ఎంతో సుభిక్షంగా ఉండేవారని ఈ రోజు ఆ పరిస్థితి కరువైంది అని తెలిపారు. చంపావతి నది జలాలు వ్యర్థం అయి సముద్రంలో కలుస్తున్నాయి అని, అధికార యంత్రాంగం వీటి మీద పట్టించుకోవట్లేదని మండిపడ్డారు. జనసేన పార్టీ లోకి ఒక మహిళగా రావడానికి ఏకైక కారణం పవన్ కళ్యాణ్ గారి భావజాలం మరియు పార్టీ సిద్దాంతాలు అని తెలిపారు. వైస్సార్సీపీ పార్టీకి 2019లో అధిక మెజారిటీతో గెలిపించారు. కానీ ఈ రోజు ఆ ప్రభుత్వమే కనీసం కాలువలు శుభ్రం చేసే పరిస్థితి కూడా లేదు అని అభివృద్ధి కుంటున పడింది అని చెప్పారు. మనం ఆలోచించాల్సింది తమ బిడ్డల భవిష్యత్తు గురించి ఇప్పటి నుండి అలోచించి ఈ ప్రభుత్వానికి వచ్చే ఎన్నికల్లో బుద్ధి చెప్పాలన్నారు. నెల్లిమర్లలో ఇద్దరు నాయకులకే అవకాశం ఇచ్చారు అని వారు నెల్లిమర్లని అభివృద్ధి బాటలో పెట్టడంలో విఫలం అయ్యారు అని తెలిపారు. ఇప్పుడు ఉన్న బడ్డుకొండ అప్పలనాయుడు భూదందాలకి తేరదీశారు అని మండిపడ్డారు. జనసేన పార్టీ అధికారం లోకి వస్తే నెల్లిమర్లని పారిశ్రామికంగా అభివృద్ధి చేసి చూపిస్తాను అని మాధవి తెలిపారు. ఊరిలోని పారిశుధ్యం సమస్య విన్న మాధవి గారు తన సొంత డబ్బుతో ఊరిలోని కాలువలు శుభ్రం చేయిస్తాను అని తెలిపారు. ఊరిలోని ప్రజలు మాధవి మాటలకి ఎంతో ఆకర్షి తులయ్యి, హర్షం వ్యక్తం చేసారు.