మిచాంగ్ తుఫాన్ బాధితులకి ఇచ్చే ఆర్థిక సహాయంలోనూ వైసీపీ నాయకుల అవినీతి

సర్వేపల్లి నియోజకవర్గం: వెంకటాచలం మండలం, మలుగుంట గ్రామంలో ఆదివారం సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు పర్యటించారు. ఈ సందర్భంగా బొబ్బేపల్లి సురేష్ నాయుడు మాట్లాడుతూ గిరిజనులకి నిజాయితీ తుఫాన్ సహాయ నిధి వైట్ కార్డు ఉండి ఒకరుంటే 1000 ఇద్దరికీ పైబడి ఉంటే 2500 ఇస్తామని ప్రకటించిన అధికార పార్టీ తీరా చూడబోతే 1800 కొంతమందికి 1900 కొంతమందికి వైసీపీ పార్టీ వాళ్లకి మాత్రం 2500 చొప్పున పంపిణీ చేశారు. అది కూడా గిరిజనులకు, మత్యకారులకు మాత్రమే పంపిణీ చేశారు. అంటే ఆ పంపిణీలో కూడా అవినీతి తుఫాన్ అనేది కులాలను బట్టి కురుస్తదా కులాలను బట్టి నష్టం వస్తుందా కులాన్ని బట్టి ఇళ్లలోకి నీళ్లు వస్తాయా కులాన్ని బట్టి గుడిసెలు వస్తాయా?. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రభుత్వం నుంచి వచ్చే ఏ పథకమైన సరే మేం కులం చూడం మే మతం చూడడం మేము వర్గం చూడడం మేము పార్టీ చూడడం అని చెప్పి వాగ్దానం చేసి ఈరోజు కనీసం తుఫాన్ వచ్చి అస్తవ్యస్తంగా పేద బడుగు బలహీన వర్గాలలో ఇళ్లల్లోకి నీళ్లు వచ్చి ఇబ్బందులు పడితే ఇచ్చే పావలా పరకైన సరే అందరికి అందజేయాల్సింది పోయి దాంట్లో కూడా కుట్టిలత్వాన్ని చూపించినటువంటి ఈ వైసీపీ ప్రభుత్వానికి ఇంకా 60 రోజులే గడువు రాష్ట్ర ప్రజలు నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఒక్క క్షణం ఆలోచించండి. ఈ అవినీతి ప్రభుత్వానికి అంతిమ గడియలు రాబోయేది జనసేన, తెలుగుదేశం ప్రజా ప్రభుత్వం ఆ ప్రభుత్వంలో అన్ని కులాలకు అన్ని మతాలకు అన్ని వర్గాలకు న్యాయం చేస్తాం. పేద బడుగు బలహీన వర్గాలకు అండగా ఉంటాం. సర్వేపల్లి నియోజకవర్గాన్ని మనం అభివృద్ధి చేసుకున్న మన రాష్ట్రాన్ని మనం అభివృద్ధి చేసుకుందాం. ఈ కార్యక్రమంలో వీరమహిళ గుమ్మినేని వాణి భవాని, స్థానికుల పినిశెట్టి మల్లికార్జున్, శ్రీహరి, ముత్తుకూరు మండల సీనియర్ నాయకులు రహీం, మనుబోలు మండల నాయకులు సుధాకర్, సుబ్రమణ్యం, వంశీ తదితరులు పాల్గొన్నారు.