కౌన్సిలర్ భారతి సురేష్ సస్పెన్షన్ ని రద్దు చేయాలి: బొమ్మిడి నాయకర్

నరసాపురం నియోజకవర్గం: వైసీపీ పాలకుల అరాచకాలను ప్రశ్నించారనే కారణంగా కక్ష్య సాధింపు చర్యగా నరసాపురం పట్టణం జనసేన పార్టీకి చెందిన 22వ వార్డు కౌన్సిలర్ భారతి సురేష్ ని మున్సిపల్ సమావేశాల నుంచి సస్పెండ్ చేయడం జరిగింది. దీనిని ఖండిస్తూ భారతి సురేష్ సస్పెన్షన్ ని రద్దు చేయాలని గురువారం నరసాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జి, పీఏసీ సభ్యులు మరియు రాష్ట్ర మత్స్యకార వికాస విభాగ ఛైర్మెన్ బొమ్మిడి నాయకర్ నరసాపురం సబ్ కలెక్టర్ కు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా నాయకర్ మాట్లాడుతూ.. గత రెండు సంవత్సరాలుగా అధికార పార్టీ కౌన్సిలర్ లు మైకులు విసరడాలు అలాగే దుర్భాషలాడటాలు చేసిన ఏరోజు ఎవరిని సస్పెండ్ చెయ్యలేదు కానీ, భారతి సురేష్ ఒక ఎస్ టి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి మరియు అతను వారి వార్డు అభివృద్ది పనులు జరగడంలేదని ప్రశ్నించిన కారణంగా అధికార మదంతో వారు ఇలా సస్పెండ్ చేశారని మండిపడ్డారు. కేవలం ఇది ఒక కక్ష్య సాధింపు చర్యగానే మేము భావిస్తున్నాము అని తెలియజేశారు. తక్షణమే ఈ సస్పెన్షన్ ని రద్దు చేయాలి అని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించని పక్షంలో తర్వాతి పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. దీని మీద లీగల్ గా కూడా ముందుకు వెళ్తాము అని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వాతాడి కనకరాజు, ఆకన చంద్రశేఖర్, బందెల రవీంద్ర, ఆకుల వెంకటస్వామి, గంటా కృష్ణ, కొల్లాటి గోపికృష్ణ, నిప్పులేటి తారకరామారావు, గుబ్బల మార్రాజు, తోట నాని, భారతి సురేష్, తోట అరుణ, కొప్పాడి కృష్ణవేణి, బొమ్మిడి సూర్యకుమారి, సముద్రాల సత్యవాణి, వలవల సావిత్రి, వాతాడి రమేష్, పోలిశెట్టి సాంబ, అందే దొరబాబు, గణేశ్న శ్రీరామ్, బొక్కా చంటి, గ్రంధి నాని మరియు నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, జనసైనికులు, వీరమహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.