రేపు దుబ్బాక ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు

దుబ్బాక ఉప ఎన్నిక ఫలితం రేపు తేలనుంది. ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపుకు సంబంధించి అధికారులు సిద్దిపేటలోని ఇందూరు ఇంజినీరింగ్ కాలేజీలో ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. మొత్తం 14 టేబుల్స్, 23 రౌండ్లలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ ముగియనుంది. మొదట 1453 పోస్టల్ బ్యాలెట్, ఆ తర్వాత 51 సర్వీస్ ఓట్లను లెక్కించనున్నారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియలో మొత్తం 200 మంది సిబ్బంది పాల్గొననున్నారు. దుబ్బాకలో 1,64,192 ఓట్లు పోలయ్యాయి.