కోవావాక్స్ టీకాల ఉత్పత్తి ప్రారంభించిన సీరం సంస్థ

కోవావాక్స్ కోవిడ్ టీకా ఉత్పత్తి ఇవాళ ప్రారంభమైంది. పుణెలో ఉన్న సీరం ఇన్స్‌టిట్యూట్‌లో ఉత్పత్తి స్టార్ట్ అయినట్లు ఆ సంస్థ తన ట్విట్టర్‌లో వెల్లడించింది. నోవావాక్స్ కంపెనీ కోవావాక్స్ టీకాను తయారు చేసిన విషయం తెలిసిందే. కొత్త మైలురాయిని చేరుకున్నామని, కోవావాక్స్ తొలి బ్యాచ్ టీకాలను తమ పుణె ప్లాంట్‌లో ఉత్పత్తి ప్రారంభించినట్లు సీరం సంస్థ పేర్కొన్నది. సెప్టెంబర్‌లోగా ఇండియాలో నోవావాక్స్ టీకా అందుబాటులోకి రానున్నట్లు సీరం వెల్లడించింది. ఆ టీకా ట్రయల్స్ ప్రస్తుతం అడ్వాన్స్ దశలో ఉన్నట్లు గతంలో సీఈవో ఆధార్ పూనావాలా తెలిపారు. నోవావాక్స్‌కు చెందిన ‘NVX-CoV2373’ టీకా స్వల్ప, మధ్య స్థాయి కోవిడ్ ఇన్‌ఫెక్షన్లపై నూరు శాతం రక్షణ చూపించినట్లు గతంలో తెలిపారు.