నాంది మూవీపై క్రాక్ డైరెక్టర్ ప్రశంసలు..!

హరీష్‌శంకర్‌ శిష్యుడు విజయ్‌ కనకమేడల తెరకెక్కించిన థ్రిల్లర్ చిత్రం నాంది. రీసెంట్‌గా విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర మంచి విజయం సాధించడమే కాకుండా అల్లరి నరేష్‌కు మంచి పేరు తీసుకొచ్చింది. పలువురు ప్రముఖులు ఈ చిత్రంపై ప్రశంసలు కురిపించగా, తాజాగా క్రాక్ చిత్ర డైరెక్టర్ గోపిచంద్ మలినేని తన ట్విట్టర్ ద్వారా చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలియజేశారు. నాంది చిత్రం ఇప్పుడే చూశాను. చాలా థ్రిల్లింగ్ ఉంది. అల్లరి నరేష్‌, వరలక్ష్మీ శరత్ కుమార్ నటన అద్భుతం. ప్రియదర్శి, హరీష్, దర్శకుడు విజయ్ తన పనిని సక్రమంగా నిర్వర్తించారు .. చిత్ర బృందానికి నా శుభాకాంక్షలు అంటూ గోపిచంద్ మలినేని తన ట్వీట్‌లో పేర్కొన్నాడు.

సుడిగాడు చిత్రం తర్వాత అల్లరి నరేష్‌కు నాంది చిత్రం మంచి విజయాన్ని అందించింది. చాలా కాలం తర్వాత సక్సెస్‌ని చవి చూడడంతో నరేశ్‌ సంతోషంతో ఉబ్బితబ్బిబైపోతున్నాడు. శుక్రవారం సాయంత్రం మీడియా సమావేశం ఏర్పాటు చేయగా, ఆ సమావేశంలో నరేష్ చాలా ఎమోషనల్ అయ్యాడు. కన్నీళ్ళు పెట్టుకున్నాడు.