ప్రభుత్వ వైఫల్యాలను పక్కదోవ పట్టించేందుకే జనసేనానిపై విమర్శలు

  • మా జనసేనానిపై వ్యక్తిగత దూషణలు చేస్తే – మేము కూడా మీ పై వ్యక్తిగత దూషణలు చేస్తాం
  • మీ శృంగార లీలలు, బూతు బండారాలు బయట పెడతాం
  • ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలనుంచి నుంచి పక్కదోవ పట్టించడానికే మా అధ్యక్షులు వారిపై విమర్శలు
  • మా నాయకుడు తెరిచిన పుస్తకం
  • తన సొంత కష్టార్జితం ప్రజలకు పెడుతున్నారు
  • మీలా ప్రజలను పీడించుకు తినటం లేదు
  • ప్రజలు మీ మంత్రుల అవినీతి, రాసలీలల బాగోతం చూసి నవ్వుతున్నారు – ముందు వారిని సరైన పద్ధతిలో పెట్టండి
  • జనసేన నేతలు హెచ్చరిక..

తిరుపతి: పాలక వైకాపా పార్టీ పాలనలో ఉన్న విధాన పరమైన లోపాలను తమ జనసేనాని ఎత్తి చూపితే, దానికి సమాధానం చెప్పలేని సీఎం జగన్ శుక్రవారం కడప పర్యటనలో తమ పవన్ కళ్యాణ్ పై వ్యక్తిగత విషయాలపై పలుమార్లు దూషణలు చేయడం మంచి పద్ధతి కాదని జనసేన పార్టీ నేతలు తిరుపతి పట్టణ అధ్యక్షుడు రాజారెడ్డి, రాష్ట్ర నాయకులు సుభాషిని, కీర్తన, డా.బాబు, మరియు న్యాయవాది ముక్కు సత్యవంతులు, సుమన్ బాబు, రాజేష్ ఆచారి, లక్ష్మి, దిలీప్, ఆదికేశవులు, భాను ప్రకాష్, మునిలు ఆగ్రహం వ్యక్తం చేశారు.. ప్రెస్ క్లబ్ లో శనివారం మీడియాతో వీరు మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలు నమ్మి గెలిపిస్తే వారి కష్టాలను తీర్చక పోగా 15 లక్షల రేషన్ కార్డులను తీసేయడం పట్ల ఆరోపణలు చేశారు.. రైతు సమస్యలు తీర్చకపోగా అమ్మ వడి, నాన్న గోచి పథకాలతో జనాన్ని మభ్యపెడుతున్నారని ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలనుంచి పక్కదోవ పట్టించడానికే మా అధ్యక్షుల వారిపై విమర్శలు చేస్తే సహించేది లేదని దుయ్యబట్టారు.. కడప జిల్లా జగన్ నియోజకవర్గం పులివెందులలో మాత్రం హైటెక్ బస్టాండు, హైటెక్ స్కూలు తదితర ఆనందకరమైన సౌకర్యాలను కల్పించి, రాష్ట్రం మొత్తాన్ని సర్వ నాశనం చేశారన్నారు, ఈసారి 175 సీట్లు వస్థాయనుకుంటున్న వైసిపికి ఒక్క సీటు రావడమే గగనమని ఎద్దేవా చేశారు, ఇక 16 నెలలు సమయంలో ఇంకా ఎన్ని దుర్మార్గాలు, అరాచకాలు దౌర్జన్యాలు, దాష్టకాలు, కోడి కత్తి, గుండెపోటు డ్రామాలు చూడాల్సి వస్తుందేమో అని ఆవేదన వ్యక్తం చేశారు. మరోసారి తమ పవన్ పై వ్యక్తిగత విమర్శలు చేస్తే జగన్ వైయస్ఆర్ చనిపోయినప్పుడు ఎక్కడ ఏ ప్యాలస్లో గడుపుతున్నారో అలాగే వాళ్ళ తాత, ముత్తాత, నాన్న, బాబాయ్, చెల్లి మొత్తం కుటుంబంలోని వారి రాసలీలల్ని సాక్షాదారులతో సహా బయట పెడతామని బహిరంగ హెచ్చరిక చేశారు.