రైతు సంక్షేమమే జనసేన ప్రధాన అజెండా.. రైతు దినోత్సవ వేడుకలలో అనంతపురం జనసేన

  • స్వేధం చిందించి నేలపై బంగారం పండించి ప్రజలందరికీ ఆహారాన్నందిస్తున్న రైతన్నలందరికీ.. వందనం, పాదాభివందనం.. కుంటిమద్ది జయరాం రెడ్డి

అనంతపురం: జాతీయ రైతు దినోత్సవాన్ని పురస్కరించుకొని.. వ్యవసాయ రైతులకు, కౌలు రైతులకు, రైతు కూలీలు అందరికీ మరియు వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్న అన్ని వర్గాల ప్రజలందరికీ అనంతపురం జిల్లా జనసేన ఉపాధ్యక్షులు లాయర్ కుంటిమద్ది జయరాం రెడ్డి రైతు దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. వ్యవసాయాన్ని నమ్ముకున్న ప్రతి రైతు కుటుంబానికి జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ అండగా ఉంటుంది. రైతు సంక్షేమమే జనసేన పార్టీ ప్రధాన అజెండా. కౌలు రైతులను అక్కున చేర్చుకొని అన్నదాతలకు అండగా నిలుస్తున్నది కేవలం జనసేన పార్టీ మరియు జనసేన అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాత్రమే. అనంతపురం నియోజకవర్గం నారాయణపురం గ్రామంలో… చీని, టమోటా, మిరప, కంది మరియు వరి రైతుల పంట పొలాలకు వెళ్లి వారి స్థితిగతులు కష్టసుఖాలు తెలుసుకొని… వారిని సన్మానించి… జనసేన పార్టీ మరియు జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు మీకు ఎల్లవేళలా అండదండగా ఉంటారని రైతులకు భరోసా కల్పించడమైనది. ఈ సందర్బంగా రైతులు మాట్లాడుతూ.. రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర మార్కెట్ సదుపాయాలు మెరుగుపరచాలని, మేలు రకమైన నాణ్యమైన విత్తనాలు రైతులు అందించాలని, నాణ్యమైన రసాయనిక ఎరువులు, పిచికారి మందులు ప్రభుత్వం అందించాలని, బ్యాంకులు ద్వారా ప్రభుత్వం రుణ సదుపాయం మొదలగు అంశాలను కుంటిమద్ది జయరాం రెడ్డి దృష్టికి తీసుకు వచ్చారు. ఈ కార్యక్రమంలో అనంతపురం జిల్లా అధ్యక్షులు టీ.సీ.వరుణ్, ఉపాధ్యక్షులు లాయర్ కుంటిమద్ది జయరాం రెడ్డి, లీగల్ సెల్లు అధ్యక్షులు మురళీకృష్ణ, ఉపాధ్యక్షులు అంకె ఈశ్వరయ్య, నగర అధ్యక్షులు పొదిలి బాబు రావు, నగర ఉపాధ్యక్షులు జక్కిరెడ్డి ఆదినారాయణ, జిల్లా ప్రధాన కార్యదర్శిలు పత్తి చంద్రశేఖర్, కుమ్మర నాగేంద్ర, జిల్లా కార్యదర్శులు కిరణ్ కుమార్, విజయ్ కుమార్, ముప్పురు కృష్ణ, నగర ప్రధాన కార్యదర్శిలు మేదర వెంకటేష్, దరాజ్ భాష, మురళి, లాల్ స్వామి, సంపత్, శ్రీమతి జక్కిరెడ్డి పద్మ, శ్రీమతి సువర్ణమ్మ, రూప, శ్రీమతి అనసూయ, వెంకటరమణ, నెట్టిగంటి హరీష్, ఆకుల అశోక్, నాయకులు రామ్మోహన్, చిరు, పవనిజం రాజు, వడ్డే వెంకటేష్, నజీమ్, హిద్దు, మళ్లీ, నౌషాద్ మరియు తదితరులు పాల్గొనడం జరిగింది.