తుఫాన్ కారణంగా 2.5 లక్షల హెక్టార్లలో పంట నష్టం

నివర్ తుపాను బీభత్సం సృష్టించింది. కాగా, భారీ వర్షాలకు 2.5 లక్షల హెక్టార్లలో పంట నష్టం జరిగిందని, వరదల కారణంగా చనిపోయిన వారి కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని పీసీసీ చీఫ్‌ శైలజానాథ్ అన్నారు. చిత్తూరు, కడప, నెల్లూరు, గుంటూరు, కృష్ణా ప్రకాశం, ఉత్తరాంధ్ర జిల్లాల్లో పంటలు నీటమునిగాయని పేర్కొన్నారు. రంగుమారిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. వరదల కారణంగా ఆప్తులను కోల్పోయిన కుటుంబాలకు ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు.