CSK VS RR: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న రాజస్థాన్

ఆడిన రెండు మ్యాచ్‌ల్లో చెరో మ్యాచ్‌ నెగ్గి, పాయింట్ల పట్టికలో నాలుగు, ఐదు స్థానాల్లో కొనసాగుతున్న చెన్నై సూపర్‌ కింగ్స్‌, రాజస్థాన్‌ రాయల్స్‌ జట్లు వాంఖడే వేదికగా జరుగనున్న పోరులో అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమయ్యాయి. ఈ మ్యాచ్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌ కెప్టెన్‌ సామ్సన్‌ టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్నాడు. ఇక ఈ మ్యాచ్‌లో విజయం సాధించి పాయింట్ల పట్టికలో ముందుకు వెళ్లాలని ఆశిస్తున్నాయి.

చెన్నై జట్టు: రుతురాజ్‌ గైక్వాడ్‌, డుప్లెసిస్‌, మొయిన్‌ అలీ, సురేశ్‌ రైనా, అంబటి రాయుడు, సామ్‌కరన్‌, ధోనీ(కెప్టెన్‌), రవీంద్ర జడేజా, డ్వేన్‌ బ్రావో, శార్దూల్‌ ఠాకూర్‌, దీపక్‌ చాహర్‌

రాజస్థాన్‌ జట్టు: జోస్‌ బట్లర్‌, మనన్‌ వోహ్రా, సంజూ శాంసన్‌(కెప్టెన్‌), శివమ్‌ దూబె, డేవిడ్‌ మిల్లర్‌, రియాన్‌ పరాగ్‌, రాహుల్‌ తెవాతియా, క్రిస్‌మోరిస్‌, జయదేవ్‌ ఉనద్కత్‌, చేతన్‌ సకారియా, ముస్తాఫిజుర్‌ రహ్మాన్‌