ముగిసిన కుంభమేళా… నేటి నుంచి హరిద్వార్ లో కర్ఫ్యూ విధింపు!

డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ కుంభమేళాలో నిన్నటితో పుణ్యస్నానాలు ముగిశాయి. ఈ నేపథ్యంలో హరిద్వార్‌లో నేటి నుంచి కర్ఫ్యూ అమలు చేస్తున్నారు. గత వారం రోజుల్లో దేశంలో కరోనాతో 17 వేల మందికి పైగా మరణించారు. ఈ నేపథ్యంలో కొవిడ్ నిబంధనలు కఠినంగా అమలు చేయాలని అధికారులు నిర్ణయించారు. పుణ్య స్నానాలు ఆచరించేందుకు వచ్చిన లక్షలాది మంది భక్తులు కొవిడ్ నిబంధనలు పాటించలేదు. దీంతో అక్కడ వైరస్ వేగంగా వ్యాప్తి చెంది. అయితే హరిద్వార్‌తో పాటు రూర్కీ, లక్సార్, భగవాన్‌పూర్‌లలో కర్ఫ్యూ నిబంధనలు అమల్లో ఉంటాయని అధికారులు స్పష్టం చేశారు.

ఉత్తరాఖండ్‌లో నిన్న ఒక్కరోజే కొత్తగా ఐదు వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇక ఏప్రిల్ 10 నుంచి 15వ తేదీ మధ్యలో కుంభమేళాకు హాజరైన వారిలో 2 వేల మందికి పైగా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఏప్రిల్ 16న 30 మంది సాధువులకు కరోనా సోకినట్లు తేలింది.