దగ్గుపాటి, అంబికాలను అత్యధిక మెజార్టీతో గెలిపించండి!

  • అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో 17వ డివిజన్ మరియు 18వ డివిజన్ ప్రకాష్ రోడ్, మల్లేశ్వరి రోడ్డు, కోర్టు రోడ్డు, గుల్జారపేట నందు ఎన్నికల ప్రచారం

అనంతపురం అర్బన్: జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆశయ సాధన కోసం జనసేన – టిడిపి- బిజెపి కూటమి ఉమ్మడి అనంతపురం అర్బన్ నియోజకవర్గపు ఎమ్మెల్యే అభ్యర్థిగా దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారిని మరియు అనంతపురం పార్లమెంట్ ఎంపీ అభ్యర్థిగా అంబికా లక్ష్మీనారాయణ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని.. ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులతో కలిసి అనంతపురం జిల్లా జనసేన ఉపాధ్యక్షులు లాయర్ కుంటిమద్ది జయరాం రెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఎన్నికల ప్రచారం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో టిడిపి, జనసేన, బిజెపి ముఖ్య నాయకులు, కార్యకర్తలు అత్యధిక సంఖ్యలో పాల్గొన్నారు.