వైసీపీ అరాచకాలపై మీడియా సమావేశం

తిరుపతి: వైసీపీ చేస్తున్న అరాచకాలపైన మీడియా సమావేశంలో జనసేన టీడీపీ బీజేపీ ఉమ్మడి అభ్యర్థి ఆరాణి శ్రీనివాసులు, జనసేన జిల్లా అధ్యక్షులు డా. పసుపులేటి హరిప్రసాద్, టీడీపీ తిరుపతి పార్లమెంట్ అధ్యక్షులు నరసింహ యాదవ్, మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, బీజేపీ నాయకులు భాను ప్రకాష్ రెడ్డి జనసేన టీడీపీ బీజేపీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. భూమన కరుణాకర్ రెడ్డి మాపైన చేస్తున్న ఆరోపణలు దెయ్యాలు వేదాలు వళ్ళించినట్లుగా ఉంది. దౌర్జన్యం, దొంగ ఓట్లతో కరుణాకర్ రెడ్డి కొడుకును గెలిపించాలని చూస్తున్నాడు. 2019 ఎన్నికల్లో తిరుపతి ఎమ్మెల్యేగా గెలిచింది టిడిపి అభ్యర్థి సుగుణమ్మ. అధికారులను బెదిరించి తానే ఎమ్మెల్యేగా భూమన ప్రకటించుకున్నాడు ప్రజాస్వామ్యబద్థంగా భూమన ఏ ఎన్నికల్లోను గెలవలేదు, టిటిడి ఛైర్మన్ గా ఉన్న భూమన వేంకటేశ్వరస్వామికి, తిరుపతి ప్రజలకు క్షమాపణ చెప్పాలి. అధికారం అడ్డం పెట్టుకుని ఇంకెన్నాళ్ళు విర్రవీగుతావు భూమన మెగాస్టార్ చిరంజీవి గారి మీద దాడులు చేయించారు. ప్రజలు ఆ ఎన్నికల్లో భూమనకు బుద్ధి చెప్తారు. చిత్తూరు నుంచి ఒక్క రౌడీని కూడా నేను తీసుకురాలేదు, రాజంపేట నుంచి ఆలూరు శ్రీనివాసులును తీసుకొచ్చి స్వతంత్ర అభ్యర్థిగా నిలబెట్టారు. నేను నాన్ లోకల్ అని వైసిపి నేతలు దుష్ర్పచారం చేసినా తిరుపతి ప్రజలు నమ్మరు భూమన కుటుంబం కడప నుంచి తిరుపతికి వచ్చింది. భూమన కరుణాకర్ రెడ్డి కళ్ళబొల్లిమాటలు తిరుపతి ప్రజలు నమ్మరు. వైఎస్.రాజారెడ్డి పేరు చెప్పుకుని భూమన తిరుపతిలో అక్రమాలు, అరాచకాలకు పాల్పడ్డారు. తిరుపతిలో రాజారెడ్డి నాటిన కలుపు మొక్క కరుణాకర్ రెడ్డి గతంలో మాజీ ఎమ్మెల్యే వెంకటరమణనను కిడ్నాప్ చేయించిన వ్యక్తి భూమన కరుణాకర్ రెడ్డి పదవులన్నీ భూమన కుటుంబంలోనే ఉన్నాయి భూమన కరుణాకర్ రెడ్డికి ఆ పేరు తల్లిదండ్రులు ఎలా పెట్టారో అర్థం కావడం లేదు రోడ్ల విస్తరణల పేరుతో వేలకోట్ల రూపాయలు తినేశారు. టిటిడిలో కాంట్రాక్టు పనులకు కమిషన్లు తీసుకున్నారు శ్రీనివాససేతు ఫ్లై ఓవర్ లో కమిషన్ ను తీసుకున్నారు భూమన. కమిషన్ ఇవ్వలేదని ఆరునెలలు పనులను నిలిపేశారు, వీధివీధికి గంజాయి వ్యాపారం చేసిన వ్యక్తి వైసిపి అభ్యర్థి అభినయ రెడ్డి ఈ స్థాయిలో అరాచకాలు గతంలో ఏ ఎమ్మెల్యే తిరుపతిలో ఎవరూ చేయలేదు. గత వారంరోజులుగా జనసేన ప్రచారాన్ని సక్రమంగా జరగనివ్వలేదు మా ప్రచారాన్ని ఎందుకు అడ్డుకుంటున్నావు భూమన కరుణాకర్ రెడ్డి ప్రచారానికి అనుమతి ఉందని స్వయంగా పోలీసులే చెప్పినా వైసిపి నేతలు లెక్క చేయలేదు
చరిత్రహీనుడుగా భూమన కరుణాకర్ రెడ్డి మిగిలిపోతాడు తిరుపతి ఎన్నికల్లో అభినయరెడ్డికి డిపాజిట్లు కూడా రావు అధికారులు కూడా నిష్పక్షపాతంగా ఎన్నికల్లో పనిచేయండి. వైసిపి నేతలకు తొత్తులుగా వ్యవహరించకండి. ఈ కార్యక్రమంలో జనసేన టీడీపీ బీజేపీ ముఖ్య నాయకులు జనసేన తిరుపతి నగర అధ్యక్షులు రాజారెడ్డి, రాష్ట్ర కార్యదర్శి ఆకేపాటి సుభాషిని టీడీపీ నాయకులు అన్నా రామచంద్ర యాదవ్, ఊక విజయ్ కుమార్, కోడూరు బాలసుబ్రమణ్యం, బిజీ కృష్ణ యాదవ్, బీజేపీ నాయకులు సామంచి శ్రీనివాస్, పొనగంటి భాస్కర్, వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.